'పెళ్లి చూపులు'తో ప్రేక్షకుల మనసులు దోచుకున్న తెలుగు నటి రీతూ వర్మ. ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళం ఇలా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ.. కొవిడ్ కారణంగా ఈ ఏడాది చాలా నష్టపోయానంటోంది. "ఈ ఏడాది ఆరంభమంతా షూటింగ్‌లతో బిజీ బిజీగా గడిచిపోయింది. ఆ వెంటనే దుల్కర్‌తో చేసిన సినిమా ఘనవిజయం సాధించడం వల్ల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మిగతా ఏడాదంతా అలాగే ఉంటుందని భావించాను. ఒకేసారి నాలుగైదు సినిమాలు చేతిలో ఉన్నాయి. అవన్నీ షూటింగ్ పూర్తిచేసుకొని విడుదలవాల్సినవే. కరోనా దెబ్బకు అన్నీ వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లేదంటే ఈ ఏడాది కనీసం నాలుగు చిత్రాలైన విజయం సాధించేవి. జీవితాంతం మరుపురాని సంవత్సరంగా మిగిలిపోవాల్సిన 2020, కరోనా దెబ్బకు నిరాశను మిగిల్చింది" అని చెప్పింది.
దాంతో ఈ ఏడాది చాలా నష్టపోయా: రీతూవర్మ - కరోనా వల్ల చాలా నష్టపోయా రీతూ వర్మ
కరోనా వల్ల ఈ ఏడాది తాను చాలా నష్టపోయినట్లు తెలిపింది హీరోయిన్ రీతూ వర్మ. దీంతో ఎంతో నిరాశకు గురైనట్లు చెప్పింది. పరిస్థితులు బాగుండి ఉంటే తాను నటించిన సినిమాల్లో కనీసం నాలుగు చిత్రాలు విడుదలై ఘన విజయం సాధించేవని చెప్పింది.
రీతూవర్మ
ప్రస్తుతం ఆమె విక్రమ్‌తో చేస్తోన్న తమిళ చిత్రం 'ధృవ నచ్చత్తిరమ్', నానితో 'టక్ జగదీష్' చిత్రాలతో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో దుల్కర్ సల్మాన్ నటించిన 'కనులు కనులు దోచాయంటే' సినిమాతో ప్రేక్షకులను అలరించింది.
ఇదీ చూడండి : ఈ ఏడాదే నాకు మంచి రోజులొచ్చాయి: రీతూవర్మ