నేచురల్ స్టార్ నాని మరోసారి శివ నిర్వాణ దర్శకత్వంలో నటించబోతున్నాడు. రీతూ వర్మ కథానాయిక. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఇంతకుముందు 'ఎవడే సుబ్రమణ్యం' సినిమా వచ్చింది. అయితే అందులో పూర్తి స్థాయి నాయికగా నటించలేదు. ఇప్పుడు ఆ అవకాశం దక్కింది. డిసెంబర్ నుంచి చిత్రీకరణ మొదలుపెడతారు.
షైన్ స్కీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'నిన్ను కోరి', 'మజిలి' వంటి విజయవంతమైన సినిమాల తర్వాత శివ నిర్వాణ ఈ మూవీని తెరకెక్కిస్తున్నాడు.