తెలంగాణ

telangana

ETV Bharat / sitara

మరుగుజ్జుగానే కాదు.. మహిళగానూ నటిస్తా: రితేష్ - marjaavaan movie

సిద్ధార్థ్ మల్హోత్రా, తారా సుతారియా, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం 'మర్జావాన్'. ఈ సినిమాలో మరో బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్​ముఖ్ మరుగుజ్జు ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు. ఈ పాత్ర గురించి కొన్ని విషయాలు చెప్పాడీ హీరో.

మర్జావాన్

By

Published : Oct 28, 2019, 12:24 PM IST

Updated : Oct 28, 2019, 3:22 PM IST

'జీరో' సినిమాలో షారుఖ్‌ ఖాన్‌ పోషించిన మరుగుజ్జు పాత్రను మర్చిపోనే లేదు మరో నటుడు అలాంటి పాత్రతో సిద్ధమైపోయాడు. మిలాప్‌ జవేరీ తెరకెక్కిస్తున్న చిత్రం 'మర్జావాన్'. ఇందులో మరుగుజ్జు ప్రతినాయకుడిగా రితేష్‌ దేశ్‌ముఖ్‌ నటిస్తున్నాడు. సిద్ధార్థ్ మల్హోత్రా, తారా సుతారియా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ పాత్ర పోషించడం సంతోషంగా ఉందన్నాడు రితేష్​.

"ఓ నటుడిగా ఎలాంటి పాత్రకైనా నేను సిద్ధమే. వృద్ధుడు, యువకుడు, దివ్యాంగుడు, స్త్రీ పాత్రలైనా చేయడం నాకు ఇష్టమే. అందుకే మర్జావాన్​లో మరుగుజ్జు పాత్ర నా వద్దకు వచ్చింది. నేను ఆ పాత్రకు న్యాయం చేయగలనని దర్శకనిర్మాతలు నమ్మినందుకు కష్టమైనా సంతోషంగా చేశా. కెరీర్‌లో ఇలాంటి పాత్రలు పోషించే అవకాశం అందరికీ రాదు కదా."
-రితేష్ దేశ్​ముఖ్, బాలీవుడ్ నటుడు

'ఏక్‌ విలన్‌' తర్వాత సిద్ధార్థ్‌ మల్హోత్రా, రితేష్‌ దేశ్‌ముఖ్‌ కలిసి నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో మరుగుజ్జుగా రితేష్‌ ఆహార్యం, ఆయన సంభాషణలు, పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటాయని తెలిపింది చిత్రబృందం.

ఇవీ చూడండి.. 'యాక్షన్​'తో అదరగొడుతున్న విశాల్..!

Last Updated : Oct 28, 2019, 3:22 PM IST

ABOUT THE AUTHOR

...view details