బాలీవుడ్ ప్రముఖ నటుడు రితేశ్ దేశ్ముఖ్.. ఆసక్తికర విషయం చెప్పాడు. 20 ఏళ్ల పాటు కెమెరా ముందున్న తాను.. ఇప్పుడు కెమెరా వెనకుండి సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు వెల్లడించాడు. అందుకు సంబంధించిన వివరాలను, పోస్టర్ను బుధవారం ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
2003లో వచ్చిన రొమాంటిక్ మూవీ 'తుఝే మేరీ కసమ్'తో నటుడిగా పరిచయమయ్యారు రితేశ్. ఆ తర్వాత మరాఠీ, హిందీ సినిమాల్లో చాలా సినిమాల్లో నటించి, ప్రేక్షకుల్ని అలరించారు.