బాలీవుడ్ ప్రముఖ నటుడు రిషీ కపూర్.. క్యాన్సర్‌తో పోరాడుతూ, ముంబయిలోని రిలయన్స్ ఆసుపత్రిలో నేడు తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పించింది. అయితే రిషీకి సంబంధించిన చివరి వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌గా మారింది.
రిషీ కపూర్ చివరి వీడియో ఇదేనా? - రిషీ కపూర్ మరణవార్త
బాలీవుడ్ స్టార్ రిషీ కపూర్.. చివరి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో భాగంగా ఆసుపత్రి సిబ్బందిలోని వ్యక్తిని దీవిస్తూ కనిపించారు ఈ నటుడు.
ఇందులో మంచంపై రిషీ కపూర్ పడుకుని ఉండగా, ఆయన పక్కనే ఉన్న ఆసుపత్రి సిబ్బందిలోని ఓ వ్యక్తి.. ఈ నటుడి సినిమా 'దివానా'లోని పాట పాడుతూ కనిపించాడు. అనంతరం అతడిని దీవించారు రిషీ. అయితే ఈ వీడియో ఇప్పటిది కాదని, రెండు నెలల క్రితం రెగ్యులర్ చెకప్ కోసం వెళ్లినప్పటదని అంటున్నారు.
ఈ రోజు సాయంత్రం ముంబయిలోని చందన్వాడి స్మశానవాటికలో రిషీ కపూర్ అంత్యక్రియలు నిర్వహించారు. ఆయన భార్య నీతూ కపూర్, కుమారుడు రణ్‌బీర్ కపూర్, సోదరుడు రణ్‌ధీర్ కపూర్‌తో పాటు నటీనటులు అభిషేక్ బచ్చన్, సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్, ఆలియా భట్ తదితరులు హాజరై ఆయనకు అంతిమ వీడ్కోలు పలికారు.