బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, అతడి తల్లి నీతూ కపూర్‌కు కరోనా పాజిటివ్ అని నెట్టింట్లో వార్తలు జోరందకున్నాయి. అయితే తాజాగా దీనిపై నటుడి సోదరి రిద్ధిమా కపూర్ సన్హి స్పందించారు. ఈ వార్తలు అవాస్తమని కొట్టిపారేశారు. ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని కోరారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాలో వెల్లడించారు.
"దయచేసి ఓ వార్తను ప్రచారం చేసేటప్పుడు అందులోని నిజాన్ని ధృవీకరించిన తర్వాతే పోస్ట్ చేయండి... మేమంతా బాగున్నాం! ధన్యవాదాలు!"
-రిద్ధిమా కపూర్, రణ్‌బీర్ సోదరి
బాలీవుడ్ సీనియర్ నటి హేమామాలిని కూడా అనారోగ్యంతో ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు పుకార్లు వచ్చాయి. అయితే ఈ వార్తలు కూడా నిరాధారమైనవని స్పష్టం చేశారు ఆమె కుమార్తె ఇషా దేఓల్.
శనివారం.. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. స్వయంగా వారే సామాజిక మాధ్యమాల వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం స్థిమితంగానే ఉంది. ఈ నేపథ్యంలో రణ్‌బీర్, నీతూ కపూర్, హేమామాలిని ఆరోగ్యంపై నెట్టింట్లో ఈ పుకార్లు వైరల్ అయ్యాయి.