కథానాయిక రిచా గంగోపాధ్యాయ వివాహం ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్‌లోనూ నటిగా మెరిసిన ఈ భామ కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంది. ఈ క్రమంలో ఆమె ఉన్నత విద్య కోసం వాషింగ్టన్ వెళ్లింది. అక్కడ తన సహ విద్యార్థి అయిన జోను ప్రేమించింది. ఇద్దరికీ నిశ్చితార్థం జరిగిందని ఈ ఏడాది జనవరిలో రిచా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. తనకు కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేసింది.
తాజాగా జోతో రిచా వివాహం జరిగింది. క్రిస్టియన్, హిందూ సంప్రదాయాల ప్రకారం కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వీరు ఒక్కటయ్యారు. వీరి వివాహ వేడుకలో తీసిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కానీ రిచా మాత్రం అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఇంకా ఫొటోల్ని షేర్ చేయలేదు.