తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లాక్​డౌన్​ వేళ భర్తతో పిక్నిక్​కు వెళ్లిన నటి! - Richa Gangopadhyay news

కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లలోనే ఉంటున్నారు. దీనికి భిన్నంగా భర్తతో కలిసి పిక్నిక్​కు వెళ్లింది నటి రిచా గంగోపాధ్యాయ. బయటకు వెళ్లినా భౌతిక దూరం పాటిస్తున్నామని చెబుతోంది జంట.

Richa Gangopadhyay who went on a picnic with her husband in the corona spread
లాక్​డౌన్​లోనూ భర్తతో పిక్నిక్​కు వెళ్లిన నటి

By

Published : Apr 21, 2020, 8:03 AM IST

కరోనా లాక్​డౌన్​ కారణంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కానీ ఇలాంటి సమయంలోనూ 'మిర్చి' నటి రిచా గంగోపాధ్యాయ మాత్రం తన భర్తతో కలిసి పిక్నిక్‌కి వెళ్లింది. గతేడాది అమెరికాకి చెందిన తన సహాధ్యాయి జో లాంగెల్లాను పెళ్లి చేసుకుందీ అందాల భామ.

పిక్నిక్​కు వెళ్లిన జంట

కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటూ భౌతిక దూరం పాటిస్తూ ఉన్నారట రిచా. అక్కడ ఒక్కో సమయంలో ఏదైనా అత్యవసర సామగ్రిని కొనుగోలుకు మాత్రమే బయటకు వచ్చేవాళ్లట. అయితే తాజాగా రిచా తన భర్తతో కలిసి దగ్గరగా ఉన్న ఒరెగాన్‌ నదికి వెళ్లిందట. అయినా ఇద్దరూ భౌతిక దూరాన్ని పాటిస్తూనే ఉన్నారట. ఇదే విషయాన్ని రిచా భర్త తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.

"కొన్ని వారాలపాటు ఇంట్లోనే ఉంటూ దూరంగా ఉండడం అంటే మామూలు విషయం కాదు. అయినా సరే మనకు ఇష్టమైన పనులు చేస్తూ భౌతిక దూరాన్ని పాటిస్తూ సరదగా ఉండొచ్చు"అని పేర్కొన్నాడు.

తెలుగులో శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'లీడర్‌' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రిచా గంగోపాధ్యాయ రవితేజతో కలిసి 'మిరపకాయ్‌', ప్రభాస్‌తో కలిసి 'మిర్చి' చిత్రంలో సందడి చేసింది.

ఇదీ చూడండి..'ఇంట్లో బతుకుతున్న మనమందరం అదృష్టవంతులం'

ABOUT THE AUTHOR

...view details