'లీడర్' చిత్రంతో కథానాయికగా వెండితెరకు పరిచయమైన భామ రిచా గంగోపాధ్యాయ. 2010 నుంచి 2013 వరకూ రిచా నటించింది కేవలం తొమ్మిది సినిమాలే అయినప్పటికీ.. ఆమెకు ఎంతో మంది అభిమానులున్నారు. అయితే ధనుష్-రిచా కలిసి నటించిన 'మయక్కం ఎన్నా' చిత్రం విడుదలై బుధవారంతో తొమ్మిది సంవత్సరాలయ్యింది. ఈ సందర్భంగా అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ ఆమె ట్విటర్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు
"వావ్.. 'మయక్కం ఎన్నా' సినిమా తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుందంటే నమ్మశక్యంగా లేదు. నా కలలను సాకారం చేసుకునేందుకు రీల్ లైఫ్ అనే ఓ పేజీని రియల్‌లైఫ్ నుంచి తొలగించడం జరిగింది. జీవితంలో ఇప్పటివరకూ నాకు ఎలాంటి బాధల్లేవు. నటిగా ఉన్న సమయంలోనే మార్కెటింగ్, మేనేజ్‌మెంట్‌లో శిక్షణ తీసుకోవాలనే ఆశ కలిగింది. అలా నేను ఎంబీఏ చేశాను. ఆ తరుణంలోనే నా క్లాస్‌మేట్‌తో పరిచయం ఏర్పడింది. అతనే చివరికి నా జీవిత భాగస్వామి అయ్యాడు. నటిగా భారత్‌లో ఉన్నప్పుడు దూరమైన నా స్నేహితులందర్నీ ఎంబీఏ కారణంగా మళ్లీ కలుసుకోగలిగాను. సినిమాలను కొనసాగించాలనేది గొప్ప ఆలోచనే అయ్యి ఉండొచ్చు.. కానీ నా భవిష్యత్తు కలలను సాకారం చేసుకోవాలనేది అంతకంటే అద్భుతమైన నిర్ణయం"