ట్రంప్ పాలనా శైలి, ఆయన విధానాలపై హాలీవుడ్ నటులు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అయితే తాజాగా ఈ జాబితాలోకి నటి రిచా గంగోపాధ్యాయ కూడా చేరిపోయింది. ఈ మేరకు ట్రంప్ మద్దతుదారుల సోషల్‌మీడియా ఖాతాలను బ్లాక్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.
"నా ట్విట్టర్ టైమ్‌లైన్ కలుషితం కాకుండా ట్రంప్ మద్దతుదారులు, ఈఎస్పీ నాన్-అమెరికన్స్‌ను బ్లాక్ చేయాలని నిశ్చయించుకున్నాను. డొనాల్డ్ అసమర్థత పాలన, మనుషుల పట్ల భయంకరంగా ప్రవర్తించే తీరు వారికి అర్థమవ్వాలని ప్రయత్నిస్తున్నా."