ప్రముఖ బాలీవుడ్ ప్రేమ జంట నటి రిచాచద్దా-అలీ ఫజల్ ఎట్టకేలకు పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. నాలుగేళ్ల నుంచి సహజీవనం చేస్తోన్న వీరిద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోనున్నారు. ఏప్రిల్ నెల చివరి వారంలో వివాహం జరగనుంది. ఇందుకోసం ముంబయిలోని ఓ కోర్టులో దరఖాస్తు చేసుకోనున్నట్లు వారి సన్నిహితులొకరు తెలిపారు.
"ప్రస్తుతం వీరిద్దరు రిజస్టర్ మ్యారేజ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ చివరి నాటికి వీరి వివాహం జరగుతుంది. పెళ్లి పనులు ఇక చకచకా జరుగుతాయి."