తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఎలాంటి వైద్య పరీక్షకు అయినా రియా సిద్ధమే' - రియా చక్రవర్తి తాజా వార్తలు

సుశాంత్ కేసుకు డ్రగ్​ మాఫియాకు సంబంధాలు ఉన్నాయా? ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రియాకు డ్రగ్స్​ తీసుకునే అలవాటు ఉందా? దీనిపై ఆమె లాయర్ ఏమన్నారంటే?

'ఎలాంటి వైద్య పరీక్షకు అయినా రియా సిద్ధమే'
నటి రియా చక్రవర్తి

By

Published : Aug 26, 2020, 7:58 AM IST

యువ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి.. ఇప్పటివరకు డ్రగ్స్ ఉపయోగించలేదని చెప్పారు ఆమె తరఫు న్యాయవాది సతీశ్ మనిషిండే. ఈ విషయంలో రియా ఎలాంటి వైద్య పరీక్షకు అయినా సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.

సుశాంత్ కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ... ఈ ఆత్మహత్యకు డ్రగ్స్​ మాఫియాకు ఏమైనా సంబంధాలు ఉన్నాయేమోనని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోను సంప్రదించింది. ఈ క్రమంలోనే రియాపై ఆరోపణలు రాగా, ఆమె లాయర్ స్పందించారు.

ఇప్పటికే అధికారులు.. రియా, ఆమె తండ్రి ఇంద్రజిత్, సోదరుడు సోవిక్, సుశాంత్ మాజీ మేనేజర్ శ్రుతి మోదీ, ఫ్లాట్​మేట్ సిద్ధార్థ్ పితానీ తదితరుల స్టేట్​మెంట్స్ తీసుకున్నారు.

ముంబయిలో ఉన్న సిట్​ బృందం.. పితానీ, సుశాంత్ వ్యక్తిగత సిబ్బందితో పాటు మరికొందరిని మంగళవారం కూడా ప్రశ్నించారు. ఇప్పటికే సుశాంత్ ఉండే ఫ్లాట్​ను ఫోరెన్సిక్​ బృందంతో కలిసి రెండుసార్లు పరీక్షించారు. సుశాంత్ శవ నివేదక విషయమై ఎయిమ్స్ ఫోరెన్సిక్ డిపార్ట్​మెంట్​ సహాయం తీసుకోవాలని అనుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details