తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'దర్యాప్తును తప్పుదోవ పట్టించారు.. చర్యలు తీసుకోండి'

సుశాంత్​ మృతి కేసులో తనపై తప్పుడు సమాచారమిచ్చిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నటి రియా చక్రవర్తి సీబీఐకి లేఖ రాశారు. ఈ కేసు దర్యాప్తును డింపుల్​ తవానీ అనే మహిళ తప్పుదోవ పట్టించారని లేఖలో ఆమె ఆరోపించారు.

Rhea Chakraborty To CBI On Neighbour's Claim
'సుశాంత్ కేసును తప్పుదోవ పట్టించింది.. చర్యలు తీసుకోండి'

By

Published : Oct 12, 2020, 9:10 PM IST

సుశాంత్‌ సింగ్‌ మృతి కేసులో మాదక ద్రవ్యాల కోణంలో అరెస్టై బెయిలుపై విడుదలైన బాలీవుడ్‌ నటి రియా చక్రవర్తి సీబీఐకి లేఖ రాశారు. సుశాంత్‌ మృతి కేసులో తనపై తప్పుడు సమాచారం ఇచ్చి దర్యాప్తు అధికారులను తప్పుదోవ పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. తన పొరుగున ఉండే డింపుల్‌ తవానీ అనే మహిళ దర్యాప్తు అధికారులను తప్పుదోవపట్టించేలా స్టేట్‌మెంట్‌ ఇచ్చారని లేఖలో పేర్కొన్నారు.

సుశాంత్‌ మరణానికి ముందు రోజే జూన్‌ 13న రియాను తన నివాసం వద్ద సుశాంత్‌ వదిలి వెళ్లినట్టు డింపుల్‌ ఓ టీవీ ఇంటర్వ్యూలో పేర్కోన్నారు. తనకు తాను ప్రత్యక్ష సాక్షిగా పేర్కొంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆమెపై తగిన చర్యలు తీసుకోవాలని రియా కోరారు. అయితే ఈ ఘటనపై దర్యాప్తు అధికారుల్ని తప్పుదోవ పట్టించేలా సమాచారం ఇచ్చిన వ్యక్తుల జాబితాను తయారు చేస్తామని రియా తరఫు న్యాయవాది తెలిపారు. ఆ జాబితాను ఆధారాలతో సహా సీబీఐ అధికారులకు పంపించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరతామన్నారు.

ABOUT THE AUTHOR

...view details