తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'సీబీఐ విచారణలో రియా చక్రవర్తి తప్పించుకోలేదు' - త్వరలోనే సీబీఐ ఎదుట నటి రియా చక్రవర్తి

సుశాంత్​ మృతి కేసులో సీబీఐ తగిన ఆధారాలు సేకరించిన తర్వాత నటి రియా చక్రవర్తిని విచారిస్తుందని హీరో తండ్రి తరఫు న్యాయవాది వికాస్​ సింగ్​ సోమవారం తెలిపారు. అధికారులు ప్రస్తుతం కేసు గురించి పూర్తిగా వివరాలు తెసుకునే పనిలో ఉన్నారని.. త్వరలోనే దీనికి సంబంధించిన అందరినీ ప్రశ్నిస్తారని చెప్పారు.

Rhea to be summoned by CBI after spadework: Sushant's family lawyer
'రియాను సీబీఐ విచారణకు త్వరలోనే పిలుస్తారు'

By

Published : Aug 25, 2020, 1:18 PM IST

Updated : Aug 25, 2020, 1:42 PM IST

దివంగత నటుడు సుశాంత్​ మృతికి సంబంధించిన వివరాలను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) సేకరించే పనిలో ఉందని.. హీరో తండ్రి తరపు న్యాయవాది వికాస్​ సింగ్​ సోమవారం వెల్లడించారు. కేసులో పూర్తి స్పష్టత వచ్చిన తర్వాత నటి రియా చక్రవర్తిని అధికారులు విచారణకు పిలుస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

"కేసుకు సంబంధించి పూర్తి వివరాలను సీబీఐ సేకరించిన తర్వాత నటి రియా చక్రవర్తిని విచారణకు పిలుస్తారు. కేసుకు సంబంధించిన ప్రతి ఒక్కరి నుంచి వివరాలు రాబడతారు. ఒకవేళ ఆమె దర్యాప్తులో అధికారులకు సహకరించక పోయినా.. తప్పించుకునే విధంగా సమాధానాలు చెప్పినా.. రియాను అరెస్టు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ కేసులో విచారణ సరైన రీతిలో జరుగుతుందని నేను భావిస్తున్నా".

-వికాస్​ సింగ్​, సుశాంత్​ తండ్రి తరపు న్యాయవాది

సుశాంత్​ కేసుకు సంబంధించి ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) ఇప్పటికే రియాను రెండు సార్లు (ఆగస్టు 9,10) ప్రశ్నించింది. ఆమెతో పాటు 56 మంది వాంగ్మూలాలు, ఇతర ఆధారాలను సేకరించారు.

సుశాంత్​ బ్యాంకు ఖాతా నుంచి దాదాపు రూ.15 కోట్లు బదిలీ జరిగిందని హీరో తండ్రి కేకే సింగ్​ జులై 28న బిహార్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఎఫ్​ఐఆర్​ను ప్రాథమికంగా తీసుకున్న ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​(ఈడీ) జులై 31న కేసు నమోదు చేసి పలువురిని విచారించింది.

సోమవారం విచారణ సాగిందిలా..

  • కేంద్ర దర్యాప్తు సంస్థ బృందం ముందుగా సబర్బన్ అంధేరిలోని వాటర్‌స్టోన్ రిసార్ట్‌కు చేరుకుంది.
  • దాదాపుగా రెండు నెలల పాటు సుశాంత్​ అక్కడే గడిపాడని తెలుస్తోంది. అక్కడ హీరోకు సంబంధించిన వివరాలను సేకరించారు.
  • ముంబయిలోని డీఆర్​డీఓ గెస్ట్​హౌస్​లో రాజ్​పుత్​ స్నేహితుడితో పాటు అతని అకౌంటెంట్​ రజత్​ మేవతిని సోమవారం విచారణకు పిలిపించారు.
  • సుశాంత్​ మృతి కేసు దర్యాప్తులో భాగంగా ముంబయి పోలీసులతో పాటు సీబీఐ అధికారులు హీరో నివాసాన్ని గతవారమే సందర్శించారు. రాజ్​పుత్​ ఇంట్లో ఫోరెన్సిక్​ నిపుణులతో ఆధారాలు సేకరించడం సహా హీరో వంటమనిషి నీరజ్​, సిద్ధార్థ్ పితాని (సుశాంత్ స్నేహితుడు)లను సోమవారం డీఆర్​డీవో అతిథి గృహంలో విచారించారు.

కేసును సీబీఐకి అప్పగించిన కోర్టు

జూన్ 14న ముంబయిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​​. తొలుత నెపోటిజమ్​ కారణమని విమర్శలు వచ్చినా, అనంతరం రియానే అతడి మృతికి కారణమంటూ సుశాంత్ తండ్రి పట్నాలో కేసు పెట్టారు. తర్వాత బిహార్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి సిఫారసు చేయడం, కొన్నిరోజులకు కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది.

Last Updated : Aug 25, 2020, 1:42 PM IST

ABOUT THE AUTHOR

...view details