సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసుపై సీబీఐ విచారణ జరిపించాలని అతడి ప్రేయని రియా చక్రవర్తి డిమాండ్ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంమత్రి అమిత్ షాకు సామాజిక మాధ్యమాల ద్వారా విన్నవించింది.
"గౌరవనీయులైన హోంమంత్రి అమిత్ షా గారికి. నేను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి. అతడు ఆత్మహత్య చేసుకుని నెల గడిచిపోయింది. నాకు ప్రభుత్వంపై పూర్తి నమ్మకముంది. న్యాయం మీద ఉన్న నమ్మకంతో ఈ విషయంలో సీబీఐ విచారణకు ఆదేశించాలని మిమ్మల్ని సవినయంగా కోరుతున్నా. అసలు సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలుసుకోవాలని అనుకుంటున్నా."