తెలంగాణ

telangana

ETV Bharat / sitara

డ్రగ్స్​ కేసు: రియాకు ప్రతి విషయం తెలుసు - సుశాంత్​ మృతి కేసు

సుశాంత్​ కేసులో మాదకద్రవ్యాలతో నటి రియాకు సంబంధం ఉందని ఎన్​సీబీ విచారణలో బయటపడినట్లు సమాచారం. డ్రగ్స్​తో ముడిపడి ఉన్న ప్రతి లావాదేవీ గురించి ఆమెకు తెలుసని రియా వెల్లడించినట్లు తెలుస్తోంది.

Rhea Chakraborty Knew Of "Every Drug Delivery, Payment", Says Agency
సుశాంత్​ కేసు: డ్రగ్స్​ లావాదేవీల్లో రియా ప్రమేయం

By

Published : Sep 9, 2020, 9:41 AM IST

బాలీవుడ్​లో డ్రగ్స్ కేసు కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే నటి రియా చక్రవర్తిని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, మంగళవారం అరెస్టు చేసింది. విచారణలో పలు విషయాలు వెల్లడించింది రియా. సుశాంత్​ డ్రగ్స్​కు సంబంధించిన ప్రతి లావాదేవీ తనకు తెలుసని ఆమె చెప్పినట్లు సమాచారం. దీనితో పాటే తామిద్దరం సేవించిన కొన్ని మాదక ద్రవ్యాల​ పేర్లను అధికారులకు తెలియజేసినట్లు తెలుస్తోంది.

ఈ కేసులో ఇప్పటికే రియా చక్రవర్తి సోదరుడు సోవిక్​, సుశాంత్​ మేనేజర్​ శ్యామూల్​ మిరిండాలతో పాటు డ్రగ్స్​ డీలర్స్​ బసిత్​ పరిహర్​, ఇబ్రహీం, జాయిద్​లను అరెస్టు చేసింది ఎన్​సీబీ. తనకు డ్రగ్స్​తో ఎలాంటి సంబంధం లేదని.. జీవితంలో ఇంతవరకు మత్తుపదార్ధాలను సేవించలేదని కొన్ని సందర్భాల్లో చెప్పిన రియా.. ఎన్​సీబీ విచారణలో పట్టుబడటం వల్ల ఆమెపై విమర్శలు వస్తున్నాయి.

జ్యుడీషియల్​ కస్టడీలో రియా

సుశాంత్‌ మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తికి న్యాయస్థానం 14 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది. సుశాంత్‌ అనుమానాస్పద మృతి కేసులో డ్రగ్స్‌ కోణం బయటపడటం వల్ల నార్కోటిక్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్​సీబీ) రంగంలోకి దిగింది. అనంతరం ఆమెను మూడు రోజుల పాటు విచారించిన అధికారులు మంగళవారం అరెస్టు చేశారు. కస్టడీలోకి తీసుకున్న రియాకు వైద్య పరీక్షలతో పాటు కరోనా పరీక్షలు చేయించారు. ఆమెకు కొవిడ్ నెగటివ్‌ రావడం వల్ల కోర్టులో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరుపరిచారు. విచారించిన న్యాయస్థానం, డ్రగ్స్‌‌ కేసులో ఆమెకు సెప్టెంబర్‌ 22 వరకు కస్టడీ విధించింది. బెయిల్ పిటిషన్​ను తిరస్కరించింది.

ABOUT THE AUTHOR

...view details