2020 ఏడాదికి గానూ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్(Most Desirable Women) జాబితాలో అగ్రస్థానంలో బాలీవుడ్ నటి రియా చక్రవర్తి(Rhea Chakraborty) నిలిచింది. గతేడాది ఆమె ప్రియుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆకస్మిక మరణంతో పాటు డ్రగ్స్ వివాదం కారణంగా రియా పేరు తరచుగా వార్తల్లోకెక్కింది. అయితే బాలీవుడ్ చిత్రాలతో లేదా ఇతర బ్రాండ్ల ప్రచారకర్తగా ఉండి రియా ఈ ఘనత సాధించలేదు. సుశాంత్ రాజ్పుత్(Sushant Singh Rajput) ఆత్మహత్య కేసులో రియా చక్రవర్తిని నిందితురాలిగా చిత్రీకరించిన తర్వాత దేశవ్యాప్తంగా పలువురు ఆమెపై ద్వేషాన్ని వెళ్లగక్కారు.
Most Desirable Women-2020: అగ్రస్థానంలో రియా చక్రవర్తి - మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020
టైమ్ సర్వేలో గతేడాది మోస్ట్ డిజైరబుల్ ఉమెన్(Most Desirable Women)గా బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి(Rhea Chakraborty) నిలిచింది. 2020లో ఆమె ప్రియుడు, నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్(Sushant Singh Rajput) ఆత్మహత్య తర్వాత రియాను ప్రధాన నిందితురాలిగా చిత్రీకరించారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆమె గురించి చర్చ జరిగింది.
గతేడాది జూన్ 14న బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్.. ముంబయిలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ మరణం వెనకున్న కారణాన్ని తెలుసుకునేందుకు సీబీఐ(CBI) రంగంలోకి దిగింది. అయితే ఈ కేసులో డ్రగ్స్ కోణం(Bollywood Drugs Case) వెలుగు చూడడం వల్ల నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(NCB) రంగంలోకి హీరోయిన్ రియా చక్రవర్తి సహా పలువుర్ని అరెస్టు చేసింది. కానీ, ఈ కేసులో ఇప్పుటికీ ఎలాంటి పురోగతి కనిపించలేదు.
ఇదీ చూడండి:రియా చక్రవర్తికి టాలీవుడ్ నుంచి ఆఫర్లు?