సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసుకు సంబంధించి ఎన్సీబీ చేపట్టిన దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది. డ్రగ్ కోణంలో మూడు రోజుల విచారణ అనంతరం.. బాలీవుడ్ నటి రియా చక్రవర్తిని మంగళవారం ఎన్సీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆమెపై ఎన్డీపీఎస్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. మరికొద్ది సేపట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సుశాంత్ కేసు విచారణ నిమిత్తం సీబీఐ, ఈడీ అధికారులు రియాను అనేక కోణాల్లో ప్రశ్నించారు.
సీబీఐ విచారణ
బిహార్ పట్నాలో సుశాంత్ తండ్రి నమోదు చేసిన ఫిర్యాదు మేరకు సుప్రీం కోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. అప్పటి నుంచి దర్యాప్తులో భాగంగా రియాను పలు కోణాల్లో ప్రశ్నిస్తూ వస్తోంది సీబీఐ. సుశాంత్ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు, రియా-సుశాంత్ మధ్య ప్రేమ, సుశాంత్ కుటుంబంతో రియాకు ఉన్న సాన్నిహిత్యంతో సహా పలు అంశాలపై సీబీఐ విచారించింది. వీటితో పాటు జూన్ 8న సుశాంత్ ఫ్లాట్ నుంచి తను వెళ్లిపోవడం, అతనికి అందించిన వైద్య చికిత్స, మందులతో సహా పలు అంశాలపై సీబీఐ రియాను ప్రశ్నించింది. రియాతో సహా ఆమె కుటుంబ సభ్యులు, కేసుతో సంబంధమున్న అనేక మందిని విచారించింది.
ఈడీ దర్యాప్తు