తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రవితేజతో  చిందేస్తోన్న అప్సర

ముద్దుగుమ్మ అప్సరా రాణి.. రవితేజ 'క్రాక్' సినిమాలో ప్రత్యేక గీతంలో చిందేస్తోంది. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.

RGV's beauty Apsara Rani item song in Ravi Teja's Krack
'క్రాక్' కోసం హీరో రవితేజతో అప్సర

By

Published : Oct 16, 2020, 5:35 PM IST

మాస్‌ మహారాజా రవితేజతో యువనటి అప్సరా రాణి ఆడిపాడుతోంది. 'క్రాక్‌' సినిమాలోని ప్రత్యేక గీతంలో సందడి చేయనుంది. ప్రస్తుతం ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా దర్శకుడు గోపీచంద్ మలినేని వెల్లడించారు.

పాట షూటింగ్​లో రవితేజ, అప్సర తదితరులు

వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. పోలీసు అధికారి వీరశంకర్‌గా రవితేజ కనిపించనున్నారు. శ్రుతి హాసన్‌ హీరోయిన్. తమన్‌ సంగీతమందిస్తున్నారు. ఠాగూర్‌ మధు నిర్మాత. వచ్చే ఏడాది ప్రారంభంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

హీరో రవితేజతో అప్సర

ABOUT THE AUTHOR

...view details