తెలంగాణ

telangana

ETV Bharat / sitara

పవన్ 'భీమ్లా నాయక్' గురించి ఆర్జీవీ వరుస ట్వీట్లు - RGV news

RGV Pawan kalyan: 'భీమ్లా నాయక్' సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలని స్టార్ డైరెక్టర్ ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఇలా చేసి పవన్ పవర్​ ఏంటో నిరూపించాలని రాసుకొచ్చారు.

pawan kalyan bheemla nayak movie
పవన్ 'భీమ్లా నాయక్'

By

Published : Jan 31, 2022, 1:20 PM IST

RGV news: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ను ఉద్దేశిస్తూ ప్రముఖ దర్శకుడు రామ్​గోపాల్‌ వర్మ సోమవారం వరుస ట్వీట్లు చేశారు. పవన్‌కల్యాణ్‌-రానా ప్రధాన పాత్రల్లో నటించిన 'భీమ్లానాయక్‌'ను పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ఆయన కోరారు. ఇటీవల విడుదలైన 'పుష్ప' బీటౌన్‌లో భారీ వసూళ్లు రాబట్టి మంచి సక్సెస్‌ సాధించిందని.. కాబట్టి 'భీమ్లానాయక్‌' చిత్రాన్ని కూడా పాన్‌ఇండియా మూవీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నారు.

ఆర్జీవీ

"పవన్‌కల్యాణ్‌.. 'సర్దార్‌గబ్బర్‌సింగ్‌'ని హిందీలో రిలీజ్‌ చేయవద్దని, అక్కడ వర్కౌట్‌ కాదని అప్పట్లో ఈ ట్విటర్‌ వేదికగా చెప్పాను. కానీ మీరు వినలేదు. ఫలితం చూశారు. ఇప్పుడు మళ్లీ చెబుతున్నా.. 'భీమ్లానాయక్‌'ను ఏ మాత్రం తగ్గకుండా పాన్‌ఇండియా స్థాయిలో విడుదల చేయండి. మీ పవర్‌ ప్రూవ్‌ చేయండి. 'పుష్ప'యే అంత వసూళ్లు రాబడితే.. మరి, మీ సినిమా ఎంత కలెక్ట్‌ చేయాలి? 'భీమ్లానాయక్‌' పాన్‌ ఇండియా రిలీజ్‌ చేయకపోతే మీ అభిమానులమైన మేమంతా వేరే హీరో అభిమానులకు సమాధానం చెప్పలేం. ఇటీవల నేను అల్లుఅర్జున్‌ గురించి పెట్టిన ట్వీట్స్‌ అన్నీ వోడ్కా టైమ్‌లో పెట్టాను. కానీ, ఇప్పుడు పెట్టిన ఈ ట్వీట్స్‌ నా కాఫీ టైమ్‌లో పెడుతున్నా. ఇప్పటికైనా నా సీరియస్‌నెస్‌ అర్థం చేసుకోండి. మీ తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చిన రామ్‌చరణ్‌, తారక్‌లు కూడా పాన్‌ఇండియా స్టార్స్‌ అయిపోతుంటే మీరు ఇంకా తెలుగులోనే సినిమాలు చేయడం మాకు బాధగా ఉంది. దయచేసి 'భీమ్లానాయక్‌'ను పాన్‌ ఇండియా మూవీగా విడుదల చేయండి. తెలుగు రాష్ట్రాలకు చెందిన 'పుష్ప', 'కొమరం భీమ్‌', 'అల్లూరి సీతారామరాజు' కథలు పాన్‌ఇండియా అయినప్పుడు 'భీమ్లానాయక్‌' కథ పాన్‌ వరల్డ్ సబ్జెక్ట్‌ కాదంటారా?" అంటూ వర్మ.. పవన్‌ను ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details