దివంగత నటుడు సుశాంత్ రాజ్‌పుత్ బయోపిక్‌ను రూపొందించేందుకు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సన్నాహాలు చేస్తున్నారని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సుశాంత్ మరణం తర్వాత.. హీరో జీవితాధారంగా ఓ సినిమాను నిర్మిస్తానంటూ ఆర్జీవీ ఇదివరకే ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆ సినిమాకు ప్రీ-ప్రొడేక్షన్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
ఓ వార్తాసంస్థ నివేదిక ఆధారంగా.. సుశాంత్ ఆత్మహత్య ఆధారంగా ఆర్జీవీ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. సుశాంత్ లవ్‌స్టోరీ, చిత్రపరిశ్రమలో రాజకీయాలు, డ్రగ్స్ వినియోగం వంటి అంశాలను ఇందులో ప్రధానంగా చూపించనున్నట్లు తెలుస్తోంది.