RGV Perni Nani : సినిమా టికెట్ల అంశంపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు వర్సెస్ ఆర్జీవీ అన్నట్టుగా ట్వీట్ వార్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. పేర్నినానిని కలిసేందుకు ఆర్జీవీ అనుమతి కోరారు. మంత్రి అనుమతిస్తే తమ సమస్యలు వివరిస్తానని చెప్పారు. జగన్ ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను పరిష్కరిస్తోందని ఆశిస్తున్నానని ట్వీట్లో పేర్కొన్నారు ఆర్జీవీ.
ఆర్జీవీ చేసిన ఈ విజ్ఞప్తికి.. ఏపీ మంత్రి పేర్ని నాని కూడా ట్విటర్ వేదికగానే స్పందించారు. "ఆర్జీవీకి ధన్యవాదాలు.. తప్పకుండా త్వరలో కలుద్దాం" అంటూ.. రిప్లే ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆర్జీవీకి మంత్రి పేర్ని నాని ఈనెల 10న అపాయింట్మెంట్ ఇచ్చారు.