Ram gopal Varma comments on kodali nani: ఏపీ మంత్రి కొడాలి నాని ఎవరో తనకు తెలియదని.. కేవలం సినిమా హీరో నాని మాత్రమే తనకు తెలుసని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. సినిమా టికెట్ ధరలపై తాను అడిగిన ప్రశ్నలకు కొడాలి నాని ఇచ్చిన కౌంటర్పై స్పందించాలని కొందరు కోరుతున్నారని ట్వీట్ చేశారు. తనకు నేచురల్ స్టార్ నాని ఒక్కడే తెలుసని.. కొడాలి నాని ఎవరో తెలియదంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘‘ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ ధరల విషయంపై నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంబంధించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్‌కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని సినిమా హీరో.. నేచురల్ స్టార్ నాని ఒక్కడే. వాళ్లు చెప్తున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు" - ఆర్జీవీ , ప్రముఖ దర్శకుడు