దాసరి సాయిరాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'దెయ్యం గుడ్డిదైతే'. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. "నేను దెయ్యం సినిమాలు చాలా తీశాను, చూశాను. కానీ దెయ్యం సినిమాలో దెయ్యం గుడ్డిది కావడం ఇప్పటివరకూ చూడలేదు. దానినే హైలెట్ చేస్తూ పేరు పెట్టడం కొత్తగా ఉంది" అని అన్నారు.
దెయ్యం ట్రైలర్‌తో ఆర్జీవీ.. 'శాకుంతలం'లో గౌతమి - GOWTHAMI samantha SHAKUNTALAM
ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ, 'దెయ్యం గుడ్డిదైతే' ట్రైలర్‌ను విడుదల చేశారు. అలానే 'శాకుంతలం'లో తాను ఓ కీలక పాత్ర చేస్తున్న నటి గౌతమి వెల్లడించారు.

ఆర్జీవీ-గౌతమి
సమంత ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న చిత్రం 'శాకుంతలం'. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాని దిల్‌రాజు సమర్పిస్తుండగా, నీలిమ గుణ నిర్మిస్తున్నారు. ఇందులో ఒకప్పటి కథానాయిక గౌతమి ఓ కీలక పాత్ర చేస్తున్నారు. ఆ విషయాన్ని ఇటీవల ఆమె ఓ కార్యక్రమంలో వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్‌పై ఉంది.