తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'దెయ్యం'తో మళ్లీ వస్తున్న ఆర్జీవీ - RGV SWATHI DEEKSHIT

రామ్​గోపాల్ వర్మ-రాజశేఖర్​ కాంబోలో తెరకెక్కిన 'దెయ్యం' చిత్రం.. ఈ నెల 16న థియేటర్లలోకి రానుంది. శుక్రవారం వచ్చిన ట్రైలర్​, ఆద్యంతం ఆసక్తిని పెంచుతోంది.

RGV-Rajsekhar Deyyam Movie Trailer
'దెయ్యం'తో మళ్లీ వస్తున్న ఆర్జీవీ

By

Published : Apr 9, 2021, 7:44 PM IST

గతంలో జె.డి.చక్రవర్తి, మహేశ్వరి, జయసుధ ప్రధాన పాత్రల్లో ‘దెయ్యం’ అనే హారర్‌ చిత్రం తెరకెక్కించి ప్రేక్షకులకి కొత్త అనుభూతి పంచారు దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ. అదే పేరుతో రాజశేఖర్‌, స్వాతి దీక్షిత్‌ ప్రధాన తారాగణంగా మరో సినిమా రూపొందించారాయన. ఈ చిత్రం ఏప్రిల్‌ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ విడుదల చేశారు. అందులో ప్రతి సన్నివేశం ఉత్కంఠను పెంచుతూ సినిమాపై ఆసక్తి కలిగిస్తోంది‌.

'దెయ్యం పట్టిందంటే.. జత కట్టిందంటే.. అంతే' అంటూ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది. దెయ్యం పట్టిన అమ్మాయి పాత్రలో స్వాతి దీక్షిత్‌, తండ్రి పాత్రలో రాజశేఖర్‌ నటన మెప్పిస్తుంది. మరి ఈ దెయ్యం కథేంటో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. తనికెళ్ల భరణి, జీవా, బెనర్జీ తదితరులు నటించిన ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో విడుదలకానుంది.

ABOUT THE AUTHOR

...view details