వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం 'పవర్ స్టార్' అనే టైటిల్‌తో ఓ చిత్రం చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. అయితే ఈ ట్రైలర్‌ను వీక్షించేందుకు 25 రూపాయలు చెల్లించాలంటూ ప్రేక్షకులకు షాకిచ్చాడు. మొట్టమొదటిసారిగా ట్రైలర్‌ను డబ్బులకు విడుదల చేస్తున్న సినిమా ఇదేనంటూ ప్రచారమూ చేస్తున్నాడు.
ప్రేక్షకులు ఇది విన్నారా.. ట్రైలర్ చూడాలంటే 25 రూపాయలట! - రామ్ గోపాల్ వర్మ వార్తలు
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. 'పవర్ స్టార్' పేరుతో ఓ చిత్రం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించాడు. అయితే ఇందుకు 25 రూపాయలు చెల్లించాలంటూ వెల్లడించాడు.
ప్రేక్షకులు ఇది విన్నారా.. ట్రైలర్ చూడాలంటే 25 రూపాయలట!
ప్రస్తుతం రామ్‌గోపాల్ వర్మ 'మర్డర్', 'వైరస్', '12 ఓ క్లాక్'అనే చిత్రాలను తెరకెక్కిస్తున్నాడు. వీటన్నింటినీ ఏటీటీ ప్లాట్ఫామ్లో విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు.