తెలంగాణ

telangana

ETV Bharat / sitara

జర్నలిస్ట్​ అర్నబ్​ గోస్వామిపై ఆర్జీవీ సినిమా - rgv latest movie updates

ప్రముఖ దర్శకుడు రామ్​గోపాల్​వర్మ తన తర్వాతి చిత్రాన్ని ప్రకటించాడు. ప్రముఖ పాత్రికేయుడు అర్నబ్​ గోస్వామిపై ఓ సినిమా తెరకెక్కించనున్నట్లు తెలిపాడు.

rgv
ఆర్జీవీ

By

Published : Aug 4, 2020, 5:15 AM IST

వివాదాలకు కేరాఫ్​ అడ్రస్​ అయిన దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ. బయోపిక్​ల స్పెషలిస్ట్​గా గుర్తింపు పొందిన ఆర్టీవీ.. ఇటీవలే 'పవర్​స్టార్'​ సినిమాతో నెట్టింట తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ లాక్​డౌన్​ సమయంలోనూ తనదైన శైలిలో సినిమాలు నిర్మిస్తూ హాట్​టాపిక్​గా నిలుస్తున్నాడు. తాజాగా మరో సంచలన చిత్రాన్ని ప్రకటించాడు ఆర్జీవీ. ప్రముఖ జర్నలిస్ట్​ అర్నబ్​ గోస్వామిపై సినిమా తీస్తానని ట్వీట్​ చేశాడు. దీనికి 'అర్నబ్.. ద న్యూస్​ ప్రాస్టిట్యూట్​'​ అనే టైటిల్​ పెట్టనున్నట్లు స్పష్టం చేశాడు.

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ ఆత్మహత్య కేసుపై.. తనదైన శైలిలో డిబేట్​లు పెట్టి ఇండస్ట్రీలో మాఫియా ప్రభావంపై విరుచుకుపడ్డాడు అర్నబ్​. ఈ క్రమంలోనే ఆర్జీవీ స్పందిస్తూ.. చిత్రసీమ గురించి అర్నబ్​ గోస్వామి చేసిన కామెంట్లు తనను చాలా ఆశ్చర్యపరిచాయని పేర్కొన్నాడు. ఇలా అనేక విశ్లేషణలతో వరుస ట్వీట్లు చేసి చర్చనీయాంశంగా మారాడు వర్మ.

ABOUT THE AUTHOR

...view details