వివాదాస్పద చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal Varma Latest News). హారర్, ఫ్యాక్షనిజం, రౌడీయిజం నేపథ్యంలో ఇప్పటికే పలు చిత్రాలు తెరకెక్కించారు. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచిన మాట అటుంచితే.. ఈ కథాంశాలతోనే వర్మ మరింత పాపులర్ అయ్యారు. విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో సాగే 'రక్త చరిత్ర' సినిమా తీసిన ఆర్జీవీ ఇప్పుడు 'తెలంగాణలో జరిగిన రక్తచరిత్ర'పై సినిమా తీయనున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ఓ వాట్సాప్ ఆడియో వైరల్ అవుతోంది.
తాజాగా వరంగల్ ములుగు రోడ్‌లోని ఎల్బీ కళాశాలకు విచ్చేసిన వర్మ ఆయన తర్వాతి సినిమాపై క్లారిటీ ఇచ్చారు. కొండా మురళి దంపతుల(RGV Konda Murali) కథాంశంతో తాను తీయబోయే సినిమా కోసమే వరంగల్ వెళ్లినట్లు తెలిపారు. అయితే.. వైరల్ అయిన లేటెస్ట్ ఆడియోలో సినిమాకు సంబంధించిన అన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చారు వర్మ. ఈ సినిమా ఎందుకు తీయాలనుకుంటున్నారో వివరించారు.
"విజయవాడలో చదవడం మూలాన నాకు అక్కడి రౌడీల గురించి తెలుసు. రామానాయుడు స్టూడియో దగ్గర జరిగిన బ్లాస్ట్ మూలాన రాయలసీమ ఫ్యాక్షనిస్టుల గురించి తెలుసు. తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాత్రం ఏమీ తెలియదు. కానీ, ఇటీవలే కొంతమంది మాజీ నక్సలైట్లు, అప్పటి పోలీసు అధికారులను కలిశాక మొదటిసారిగా ఈ సబ్జెక్ట్‌పై అవగాహన వచ్చింది. కొండా మురళిని కూడా కలిసి ఈ సినిమాకు సహకరించాలని కోరా."
-రామ్ గోపాల్ వర్మ, డైరెక్టర్.