టాలీవుడ్ వివాదాస్పద దర్శకడు రాంగోపాల్ వర్మ బయోపిక్ త్వరలో వెండితెరపై కనువిందు చేయనుంది. ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా తెరకెక్కించనున్నారు దొరసాయి తేజ. బొమ్మాకు మురళి నిర్మించనున్నారు. సెప్టెంబరు నుంచి షూటింగ్ ప్రారంభంకానుంది. ఒక్కో చిత్రం సుమారు 2 గంటల నిడివి ఉంటుంది. ఈ విషయాన్ని వర్మ ట్వీట్ చేశారు. ఒక్కొక్క పార్టులో.. వర్మ గురించి వేరు వేరు వయసుల్లో వేరు వేరు అంశాలను చూపెట్టబోతున్నాయి ఈ చిత్రాలు.
పార్ట్ 1 : రాము
ఇందులో వర్మ 20 ఏళ్లప్పుడు... కాలేజ్ రోజులు, తొలి ప్రేమలు, గ్యాoగ్ ఫైట్స్ తో మొదలయ్యి శివ చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నారన్నది చూపిస్తారు. అతడి పాత్రలో ఒక కొత్త నటుడు నటించబోతున్నాడు.
పార్ట్ 2.. రామ్ గోపాల్ వర్మ : అండర్ వరల్డ్ తో ప్రేమాయణం