మెగాస్టార్ మోహన్‌లాల్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న మలయాళ బిగ్‌బాస్ సీజన్ 3 షూటింగ్‌ను తమిళనాడు పోలీసు అధికారులు నిలిపివేశారు. చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్‌సిటీలో ఈ షో కోసం వేసిన షూటింగ్ సెట్‌ను సీజ్ చేశారు. కరోనా ఆంక్షల్ని ఉల్లంఘించి చిత్రీకరణ జరపడమే ఇందుకు కారణం.
బిగ్‌బాస్ సెట్ సీజ్ చేసిన పోలీసులు - మలయాళ బిగ్‌బాస్ సెట్ సీజ్
కరోనా ప్రొటోకాల్స్‌ను ఉల్లంఘించి చిత్రీకరణ జరిపినందుకు మలయాళ బిగ్‌బాస్ సీజన్ 3 షూటింగ్‌ను నిలిపివేశారు పోలీసు అధికారులు. చెన్నైలో ఈ కార్యక్రమం కోసం వేసిన షూటింగ్ సెట్‌ను సీజ్ చేశారు.

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో మే 31వరకు చిత్రీకరణలను నిలిపివేయాలని ఆదేశించింది ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా(ఎఫ్ఈఎఫ్ఎస్ఐ). అయితే ఈ ప్రొటోకాల్స్‌ను ఉల్లంఘించి ఈ షో షూటింగ్‌ను జరిపారు. ఇది తెలుసుకున్న అధికారులు షూటింగ్ సెట్‌ను సీజ్ చేశారు. కంటెస్టులను ఓ హోటల్‌కు తరలించారు. గత వారమే ఈ షోకు సంబంధించిన ఆరుగురు సహాయక సిబ్బంది కరోనా బారిన పడ్డారు. పరిస్థితి సద్దుమణిగాక ఈ కార్యక్రమం చిత్రీకరణను పునఃప్రారంభిస్తామని ప్రకటించారు ఈ షో నిర్వాహకులు.
ఇదీ చూడండి: గులాబీ డ్రెస్స్‌లో బిగ్‌బాస్ బ్యూటీ పోజులు!