పేదింటి బిడ్డకు పెద్ద జబ్బు ఆదుకోండి ప్లీజ్ అని ఈటీవీ భారత్లో సెప్టెంబర్ 26న ప్రచురితమైన కథనానికి సినీనటుడు సోనూసూద్ స్పందించారు. వైద్యానికి అయ్యే ఖర్చంతా తాను అందిస్తానని భరోసాను ఇచ్చినట్లు బాధితుని తండ్రి తెలిపారు.
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం పెరుమాండ్ల సంకీస గ్రామానికి చెందిన దేశ బోయిన నాగరాజు, శ్రీ లక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు... కుమార్తె, కుమారుడు. కొడుకు హర్షవర్ధన్ ఆరునెలల వయసు నుంచే అనారోగ్యానికి గురయ్యాడు. స్థానికంగా తగ్గకపోవడం వల్ల హైదరాబాద్ లోని ఓ పెద్ద ఆసుపత్రిలో చూపించారు.