తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సాంగ్స్​తో సాయితేజ్​, శర్వానంద్​.. 'ఖిలాడి' అప్డేట్​ - sai dharam tej republic

మిమల్ని అలరించేందుకు సినిమా కబుర్లు వచ్చాయి. ఇందులో సాయితేజ్​, శర్వానంద్​-సిద్ధార్థ్​, రవితేజ కొత్త సినిమా విశేషాలు ఉన్నాయి. అవన్నీ మీకోసం..

cinema
అప్డేట్స్​

By

Published : Sep 6, 2021, 1:43 PM IST

సాయిధరమ్‌ తేజ్‌ కలెక్టర్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం 'రిపబ్లిక్‌'(sai dharam tej republic). ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా నుంచి ఓ కొత్త పాటను చిత్రబృందం విడుదల చేసింది. 'సూడబోదమా.. ఆడబోదమా' అంటూ సాగే ఈ పాట ఆకట్టుకునేలా ఉంది. హుషారెత్తించేలా ఉన్న ఈ పాటను అనురాగ్‌ కులకర్ణి, సాకీ శ్రీనివాస్ ఆలపించారు. ఈ పాటకు స్క్రీన్‌పై సాయిధరమ్‌ తేజ్‌ ఫుల్‌ మాస్‌ స్టెప్పులతో ఆకట్టుకోనున్నారు.

'సోలో బ్రతుకే సో బెటర్‌' తర్వాత సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. దేవకట్టా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సాయికి జోడీగా ఐశ్వర్యా రాజేశ్‌ సందడి చేయనున్నారు. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలకపాత్రలు పోషించారు. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై భగవాన్‌, పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ స్వరాలు అందిస్తున్నారు.

త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'మహాసముద్రం'లోని(mahasamudram movie poster) ఓ ప్రేమ పాటకు నటి రష్మిక ఫిదా అయ్యారు. పాట చాలా బాగుందన్నారు. ఈ చిత్రంలోని శర్వానంద్‌-సిద్దార్థ్‌ ప్రధాన పాత్రల్లో నటించగా.. అజయ్‌ భూపతి దర్శకత్వం వహించారు. ఇంటెన్స్ ప్రేమకథా చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈసినిమాలో ఆదితి రావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయికలు. ఈ సినిమా నుంచి సోమవారం ఉదయం 'చెప్పకే చెప్పకే' అంటూ సాగే ఓ ప్రేమ పాటను రష్మిక విడుదల చేశారు. ఈ గీతాన్ని దీప్తి పార్థసారథి ఆలపించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చైతన్‌ భరద్వాజ్‌ స్వరాలు అందిస్తున్నారు.

మాస్‌ మహారాజ్‌ రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'ఖిలాడి'(raviteja khiladi). రమేష్ వర్మ దర్శకుడు. ఈ సినిమాలో తొలి సాంగ్​ను సెప్టెంబరు 10న విడుదల చేస్తామని ప్రకటించారు. పెన్ స్టూడియోస్‌, ఎ స్టూడియోస్ ఎల్ఎల్పీ కలిసి నిర్మిస్తున్న చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. డింపుల్‌ హయాతీ, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఖిలాడి

ఇదీ చూడండి: థియేటర్, ఓటీటీలో ఈ వారం సందడి చేసే చిత్రాలివే!

ABOUT THE AUTHOR

...view details