తెలంగాణ

telangana

ETV Bharat / sitara

టబు, భూమిక బాటలోనే రేణు దేశాయ్​!

రేణు దేశాయ్​ మరోసారి వెండితెరపై నటించేందుకు సిద్ధమవుతున్నారా? అంటే ఇటీవల ఓ వేదికపై చెప్పిన విషయాలను చూస్తే, ఏదో ఒక రోజు తప్పకుండా వెండితెరపై కనపడతారనే చర్చ నడుస్తోంది.

Renu-Desai-re-entry-as-an-actor-in-movies
టబు, భూమిక బాటలోనే రేణు దేశాయ్​

By

Published : Jan 31, 2020, 6:29 AM IST

Updated : Feb 28, 2020, 2:54 PM IST

రేణు దేశాయ్‌.. పరిచయం అక్కర్లేని పేరు. పవన్‌కల్యాణ్‌ సతీమణిగా అందరికీ సుపరిచితమే. పరస్పర అవగాహనతో వైవాహిక జీవితం నుంచి విడిపోయి ఎవరి జీవితాన్ని వారు గడుపుతున్నారు. పవన్‌ రాజకీయాల్లో బిజీగా ఉండగా, రేణుదేశాయ్‌ సినిమా వైపు అడుగులు వేశారు. దర్శకురాలిగా, నిర్మాతగా తనదైన ముద్రవేశారు రేణు​.

అందుకే ఆ పాత్ర చేయలేకపోయా!

శివ కందుకూరి హీరోగా పరిచయమవుతున్న చిత్రం 'చూసీ చూడంగానే'. ఈ చిత్రానికి శేష సింధు దర్శకురాలు. ఇటీవల జరిగి సినిమా ప్రీరిలీజ్‌ వేడుక సందర్భంగా రేణు దేశాయ్‌ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. "ఇండస్ట్రీలోకి ఉమెన్ టెక్నీషియన్స్ ఎక్కువమంది రావాలని కోరుకుంటున్నాను. ఏదో ఒకరోజు మేల్, ఫిమేల్ డైరెక్టర్ అనే భేదం పోయి డైరెక్టర్ అని మాత్రమే మాట్లాడుకోవాలి. ఏ మహిళా టెక్నీషియన్ అయినా ఆనందంగా పని చేసుకోగల చక్కని నిర్మాత రాజ్ కందుకూరి గారు. ఆయన నాకు ఈ సినిమాలో తల్లిగా చేయమని అడిగారు. ఆ పాత్ర నాకు బాగా నచ్చింది కూడా. కానీ నాకు ఒంట్లో బాగా లేకపోవడం వల్ల చేయలేకపోయాను. తర్వాతి చిత్రంలో అవకాశం ఇస్తే తప్పకుండా చేస్తాను. ఈ సినిమా కచ్చితంగా మ్యూజికల్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాను" అని చెప్పింది. అంటే కథలో బలమైన పాత్రలు ఉంటే రేణు దేశాయ్‌ తప్పకుండా నటించే అవకాశం ఉందని చెప్పకనే చెప్పారు. ఆమె మాటలను బట్టి చూస్తే త్వరలోనే వెండితెరపై రేణును చూసే అవకాశం ఉందని తెలుస్తోంది.

బద్రి, జానీ సినిమాలో పవన్​ కల్యాణ్​తో రేణు దేశాయ్​

వారంతా దూసుకుపోతున్నారు..!

మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన రేణుదేశాయ్‌ 'బద్రి' చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. ఈ సినిమా చిత్రీకరణలోనే పవన్‌-రేణు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. నిజ జీవితంలో భార్య భర్తలైన వీరిద్దరూ 'జానీ'లో దంపతులుగా నటించారు. ఆ తర్వాత రేణు దేశాయ్‌ మరో చిత్రంలో నటించలేదు. కానీ, 'గుడుంబా శంకర్‌', 'బాలు', 'అన్నవరం' చిత్రాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేశారు. 2014లో 'ఇష్క్‌ వాలా లవ్‌' చిత్రంతో దర్శకురాలిగా, నిర్మాతగా మారారు. ప్రస్తుతం కథా రచనపై దృష్టి సారించానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రేణుదేశాయ్‌ చెప్పారు. త్వరలోనే మరో సినిమాకు దర్శకత్వం వహిస్తారా? లేదా కథా ప్రాధాన్యం ఉన్న చిత్రంలో బలమైన పాత్ర వస్తే చేస్తారా? అనేది చూడాలి. నదియా నుంచి టుబు, భూమికల వరకూ అలనాటి స్టార్‌ హీరోయిన్లు తమదైన పాత్రల్లో దూసుకుపోతున్నారు. మరి రేణు దేశాయ్‌ ఎలా రీఎంట్రీ ఇస్తారో చూడాలి.

ఇదీ చూడండి..'యధార్థ సంఘటన ఆధారంగా అశ్వాథ్థామ తెరకెక్కించాం'

Last Updated : Feb 28, 2020, 2:54 PM IST

ABOUT THE AUTHOR

...view details