హీరోయిన్ రేణూ దేశాయ్ నటనకు స్వస్తి చెప్పాక మెగాఫోన్ పట్టుకున్నారు. ప్రస్తుతం రైతు సమస్యల నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులోని ఓ పాటను ప్రముఖ రచయిత గోరేటి వెంకన్న రచిస్తున్నారు. ఆ సాంగ్ కోసం ఆయన ఇంటికి వెళ్లి కలిశారు రేణు.
గోరేటి వెంకన్న ఇంటికి వెళ్లిన రేణూ దేశాయ్ - గోరేటి వెంకన్న వార్తలు
హీరోయిన్ రేణూ దేశాయ్ నటనకు స్వస్తి చెప్పాక దర్శకత్వంపై దృష్టి సారించారు. ప్రస్తుతం రైతు సమస్యలపై ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ఓ పాటను రచించాలని ప్రముఖ రచయిత గోరేటి వెంకన్నను కోరారు. అందుకోసం రేణు ఆయన ఇంటికి వెళ్లారు.
గోరేటి వెంకన్న ఇంటికి వెళ్లిన రేణూ దేశాయ్
"రైతు సమస్యలపై నేను తీస్తున్న చిత్రంలో గోరేటి వెంకన్న చేత పాటలు రాయించుకుందామని ఆయన ఫామ్ హౌస్కు వెళ్లా. నా సినిమాకు ఆయన పాట రాయడాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నా. ఆయన భార్య నా కోసం మట్టి పాత్రల్లో అన్నం, పప్పు చేశారు. రోటీ పచ్చడి చేశారు. అరటి ఆకులో భోజనం పెట్టారు. సాధారణ జీవితాన్ని గడుపుతున్న వారితో ఆదివారం మధ్యాహ్నం చాలా ఆనందంగా, ఆహ్లాదంగా గడిచింది.. మంచి అనుభూతిని పొందా" అని రేణూ రాసుకొచ్చారు.