స్టార్ హీరో ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాలో ప్రతినాయకుడు లంకేష్‌గా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ కనిపించనున్నారు. అయితే ఈ విషయాన్ని ప్రకటించిన తర్వాత సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ పాత్రలో సైఫ్‌ను తొలగించాలంటూ సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
'ఆదిపురుష్'లో సైఫ్ వద్దనడానికి నెటిజన్లకు ప్రత్యేక కారణం ఏం లేనట్లు అనిపిస్తోంది. ఇది భారతీయ ఇతిహాస కథతో తీస్తుండటం వల్ల దానిపై సైఫ్‌కు పెద్దగా అవగాహన లేదని కొందరు అంటుంటే.. సుశాంత్‌ను వదిలియేమని సారాను సైఫ్ బెదిరించాడని మరికొందరు ఆరోపించారు. బంధుప్రీతికి అతడు కూడా ఓ కారణమని, అందుకే సైఫ్ స్థానంలో రానాను ఎంచుకోవాలని అభిప్రాయం వ్కక్తం చేస్తున్నారు.
ట్రెండింగ్‌లో..