హీరో దగ్గుబాటి రానా కథానాయకుడిగా నటించిన బహుభాషా చిత్రం 'అరణ్య'. తెలుగు, హిందీ(హాథీ మేరే సాథీ), తమిళ(కాండన్) భాషల్లో మార్చి 26న ఒకేసారి విడుదల చేయాలని గతంలో నిర్ణయించారు.
'అరణ్య' హిందీ వెర్షన్ విడుదల వాయిదా - హాథీ మేరే సాథీ రిలీజ్ వాయిదా
హీరో రానా నటించిన 'అరణ్య' సినిమా మార్చి 26న హిందీలో విడుదల కావడం లేదు. కరోనా కారణంగా తాత్కాలికంగా రిలీజ్ డేట్ను వాయిదా వేసినట్లు ప్రకటించింది చిత్రబృందం. తెలుగు, తమిళ భాషల్లో మాత్రం అదే రోజున సినిమా విడుదలవుతుంది.
అరణ్య
కానీ హిందీలో ఈ చిత్ర విడుదలకు ఆటంకం ఏర్పడింది. కరోనా కారణంగా ఈ సినిమా విడుదల తేదీని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది చిత్రబృందం. తెలుగు, తమిళంలో మాత్రం యథావిథిగా మార్చి 26న రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ చిత్రంలో విష్ణు విశాల్ కీలక పాత్ర పోషించారు. ప్రభు సాల్మన్ దర్శకుడు.
ఇదీ చూడండి: 'అక్కడ మొక్కలకు అంత ప్రాధాన్యమిస్తారు!'