భారత్‌లో తీవ్రమైన కరోనా ప్రభావిత రాష్ట్రాల్లో ఒకటిగా కొనసాగుతోంది మహారాష్ట్ర. అయితే ముంబయిలోని బాంద్రాలో సీనియర్ నటి రేఖ నివాస ప్రాంతం 'సీ స్ప్రింగ్స్' ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్‌గా మారింది. అయితే తన బంగ్లాలోని ఓ సెక్యూరిటీ గార్డుకు కరోనా రావడం వల్ల.. రేఖకు పరీక్షకు చేసేందుకు అధికారులు ప్రయత్నించారు. అయితే అందుకు నటి తిరస్కరించినట్లు బీఎంసీ అధికారులు తెలిపారు.
తను ఎవరితోనూ కాంటాక్ట్ అవలేదని, టెస్టు అవసరం లేదని పేర్కొన్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా తన ఇళ్లు, పరిసర ప్రాంతాల్లో శానిటైజేషన్‌కు ఆమె అంగీకరించట్లేదని మున్సిపల్ అధికారులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.