తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'అలా చేయకపోతే ఓటీటీలోనూ పోర్న్' - ఓటీటీ మాధ్యమాలు

ఓటీటీలకు నిబంధనలు కచ్చితంగా ఉండాల్సిందేనని నటుడు అజయ్ దేవ్​గణ్ ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. లేదంటే వాటిలో నీలి చిత్రాలు కూడా పెట్టే అవకాశముందని అన్నారు.

Ajay Devgan
అజయ్​దేవ్​గణ్

By

Published : Aug 13, 2021, 10:29 PM IST

అజయ్​దేవ్​గణ్​ ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'భుజ్​: ది ప్రైడ్​ ఆఫ్ ఇండియా'. ఈ సినిమా ఆగస్టు13(శుక్రవారం) ఓటీటీ వేదికగా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఓటీటీ వేదికలపై అజయ్​దేవ్​​గణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిబంధనలు ఉండటం ముఖ్యమే కానీ.. అవి మరీ ఆందోళన కలిగేంచే విధంగా ఉండొద్దని అభిప్రాయపడ్డారు.

రూల్స్ ఉండాల్సిందే..

"ఓటీటీల్లో నిబంధనలు లేకుంటే.. ప్రజలు దానిని అవకాశంగా తీసుకుంటారు. అలానే మరికొంతమంది ఆలోచిస్తే మొత్తం ఇండస్ట్రీ నాశనం అవుతుంది. నిబంధనలు లేకపోతే.. పోర్న్ సైతం ఓటీటీల్లో పెడతారు. అందుకే రూల్స్, రెగులేషన్స్ ఉండటం ముఖ్యం కానీ.. అవి ఒక పరిధి వరకు ఉంటేనే ఉత్తమం" అని అజయ్​దేవ్​​గణ్ చెప్పుకొచ్చారు.

1997లో భారత్​-పాకిస్థాన్​ మధ్య గుజరాత్​లో జరిగిన యుద్ధ నేపథ్యంతో 'భుజ్' చిత్రాన్ని రూపొందించారు. సోనాక్షి సిన్హా, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషించారు.

ఎస్.ఎస్.రాజమౌళి 'ఆర్​ఆర్​ఆర్​'లోనూ అజయ్​దేవ్​గణ్​ ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. యంగ్​టైగర్ ఎన్​టీఆర్, రామ్​ చరణ్​ ఇందులో హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఇవీ చదవండి:

Ajay Devgn: దేశభక్తి కథ.. మళ్లీ కాసులు కురిపిస్తుందా?

ఓటీటీ ఎంట్రీకి అజయ్ దేవ్​గణ్ రెడీ

ABOUT THE AUTHOR

...view details