తెలంగాణ

telangana

By

Published : Feb 22, 2020, 7:51 AM IST

Updated : Mar 2, 2020, 3:44 AM IST

ETV Bharat / sitara

పది వేల అడుగుల ఎత్తులో రామ్‌ డ్యూయెట్‌

రామ్ హీరోగా.. కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'రెడ్'. తాజాగా ఇటలీలోని డోలోమైట్స్ పర్వత ప్రాంతాల్లో ఈ సినిమా పాటను చిత్రీకరించారు.

రెడ్
రెడ్

యువ కథానాయకుడు రామ్‌ నాయిక మాళవిక శర్మతో కలిసి పది వేల అడుగుల ఎత్తులో ప్రేమ గీతం ఆలపించాడు. ఈ ఇద్దరితో కిశోర్‌ తిరుమల తెరకెక్కిస్తున్న చిత్రం 'రెడ్‌'. స్రవంతి రవికిశోర్‌ నిర్మాత. ఇటలీలోని డోలోమైట్స్‌ పర్వత ప్రాంతాల్లో ఈ పాటను చిత్రీకరించారు. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా అభిమానులతో పంచుకుంది చిత్రబృందం.

రెెడ్ చిత్ర యూనిట్

ఇక్కడ ఎక్కువగా హాలీవుడ్‌ చిత్రాలు తెరకెక్కిస్తారు. ఇప్పుడు ఈ జాబితాలో చేరిన తొలి తెలుగు చిత్రంగా 'రెడ్‌' నిలిచింది. మరో పాటను ఈ నెలాఖరున హైదరాబాద్‌లో షూట్‌ చేయనున్నారు. త్వరగా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో రామ్‌ సరసన మరో నాయిక నివేదా పేతురాజ్‌ నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. రామ్‌- కిశోర్‌ కాంబినేషన్‌లో రాబోతున్న మూడో చిత్రం కావడం వల్ల అభిమానుల్లో అంచనాలు పెరిగాయి.

Last Updated : Mar 2, 2020, 3:44 AM IST

ABOUT THE AUTHOR

...view details