తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో తెలుసుకున్నా!' - నివేదా పేతురాజ్ వార్తలు

చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన 15 ఏళ్ల తర్వాత తనకు పోటీ ఎవరనేది తెలిసిందని అంటున్నారు యువ కథానాయకుడు రామ్​ పోతినేని. ఆయన హీరోగా నటించిన 'రెడ్​' చిత్రం ఇటీవల విడుదలై ప్రేక్షకుల నుంచి విశేషాదరణ దక్కించుకుంటోంది. ఈ సందర్భంగా వైజాగ్​లో సినిమా విజయోత్సవ వేడుకను చిత్రబృందం నిర్వహించింది.

red movie success meet
'ఇండస్ట్రీలో నాకు పోటీ ఎవరో ఇప్పటికి తెలుసుకున్నా!'

By

Published : Jan 17, 2021, 8:03 AM IST

తనకు అసలైన పోటీ ఎవరనేది పదిహేనేళ్ల తర్వాత ఇప్పుడు తెలిసిందని రామ్‌ పోతినేని అన్నారు. ఇప్పటిదాకా ఒకలెక్క.. ఇకపై ఒక లెక్క అంటూ అభిమానులకు ఎంటర్‌టైన్‌మెంట్‌పై భరోసా కల్పించారు. రామ్‌ హీరోగా తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'రెడ్‌' విడుదలై థియేటర్లలో ప్రేక్షకులను మెప్పిస్తోంది. ఈ సినిమా సక్సెస్‌మీట్‌ను విశాఖపట్నంలో నిర్వహించారు. ఈ సందర్భంగా హీరో రామ్‌ మాట్లాడారు.

'రెడ్'​ సినిమా చిత్రబృందం

"సినిమాను అందరం కష్టపడి.. ఇష్టపడి చేశాం. సినిమా ఇంతబాగా రావడానికి ముఖ్య కారణం కిషోర్‌. సినిమాకు కెప్టెన్‌ ఆయనే. మణిశర్మ గారితో 'ఇస్మార్ట్ ‌శంకర్‌' చేశాను. మళ్లీ ఇప్పుడు కలిసి పనిచేశాం. మా కాంబినేషన్‌ ఇలాగే కొనసాగుతుంది. మాళవిక.. బాగా పనిచేసింది. ఇప్పుడు టాలీవుడ్‌ క్రష్‌ ఆమె. ఈ సినిమాను సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తీశాం. రిలీజ్‌కు ముందు మేం కొంచెం టెన్షన్‌ పడ్డాం. రివ్యూలు ఎలా వస్తాయో.. ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో? అని అనుకున్నాం. కానీ.. సినిమాలో ట్విస్టులకంటే సినిమా విడుదలయ్యాక ట్విస్టులే ఎక్కువయ్యాయి. మీరంతా భారీ కలెక్షన్లతో థ్రిల్‌ ఇచ్చారు. ఇంతమంచి విజయం అందించిన ప్రేక్షకుల అందరికీ థాంక్స్‌. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఇదే సంక్రాంతికి 'దేవదాసు'తో వచ్చాను. ఈ ప్రయాణంలో చాలామంది అడిగారు.. మీకు పోటీ ఎవరని? కానీ.. నాకు పోటీ ఎవరో అనేది ఇప్పుడు అర్థమైంది. మీరే (అభిమానులే) నాకు నిజమైన పోటీ. మీరు నాపై చూపించే ప్రేమ ఎక్కువ..? లేక స్క్రీన్‌పై నేను చూపించే ప్రేమ ఎక్కువ అనేది చూపిస్తా."

- రామ్​ పోతినేని, కథానాయకుడు

హిందీలో వచ్చిన 'తడమ్‌'కు రీమేక్‌గా రూపొందిందీ చిత్రం. రామ్‌ సరసన మాళవికశర్మ, నివేదా పేతురాజ్‌, అమృత అయ్యర్‌ నటించారు. మణిశర్మ సంగీతం అందించారు. స్రవంతి రవికిషోర్‌ నిర్మాతగా వ్యవహరించారు.

మాళవిక శర్మ
హీరో రామ్

ఇదీ చూడండి:'లూసిఫర్' కథలో మార్పు.. కీలకపాత్రలో నయన్​!

ABOUT THE AUTHOR

...view details