'ఇస్మార్ట్ శంకర్' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రామ్ హీరోగా నటిస్తున్న సినిమా 'రెడ్'. థ్రిల్లర్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్ర టీజర్ నేడు(శుక్రవారం) విడుదలైంది. ఆద్యంతం అలరిస్తూ అంచనాల్ని పెంచుతోంది. ఇటీవలే ఇటలీలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుందీ చిత్రం. అందులో భాగంగా రెండు పాటల్ని తీశారు.
రెడ్ టీజర్: 'ఇలాంటి కేసు చూడటం ఇదే ఫస్ట్‌టైమ్' - entertainment news
రామ్ ద్విపాత్రాభినయంలో నటిస్తున్న 'రెడ్' టీజర్ నేడు విడుదలైంది. ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
రెడ్ సినిమాలో రామ్
ఇందులో రామ్ సరసన నివేదా పేతురాజ్, మాళవిక శర్మ, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కిశోర్ తిరుమల దర్శకుడు. ఇంతకు ముందు ఇదే డైరెక్టర్‌తో 'నేను శైలజ', 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాలు చేశాడు రామ్. శ్రీ స్రవంతి మూవీస్ నిర్మిస్తోంది. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
Last Updated : Mar 2, 2020, 9:09 PM IST