లాక్డౌన్ అనంతరం సినిమా షూటింగ్ల్ని ముమ్మరం చేస్తున్నాయి చిత్ర యూనిట్లు. అలాగే విడుదల తేదీలపై ఓ క్లారిటీకి వస్తున్నాయి. కరోనా కారణంగా ఇంకా థియేటర్లు తెరచుకోకపోవడం వల్ల నిర్మాతలు సంక్రాంతి పండక్కి సినిమాల్ని రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా రామ్ నటిస్తోన్న 'రెడ్' చిత్రాన్ని కూడా సంక్రాంతికే విడుదల చేస్తామని చిత్రబృందం తెలిపింది. దసరా పండగ సందర్భంగా ప్రేక్షకులకు ఈ శుభవార్తను అందించింది. ఈ చిత్రానికి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
సంక్రాంతి రేసులో 'క్రాక్', 'రెడ్' - కిషోర్ తిరుమల
హీరో రామ్ నటిస్తోన్న 'రెడ్', రవితేజ కథానాయకుడుగా చేస్తోన్న 'క్రాక్' సంక్రాంతికి విడుదల కానున్నాయని సంబంధిత చిత్ర యూనిట్లు పేర్కొన్నాయి. దసరా సందర్భంగా ప్రేక్షకులకు ఈ శుభవార్తను అందించాయి.
రెడ్, క్రాక్ చిత్రాలు సంక్రాంతికి రిలీజ్
అలాగే నటుడు రవితేజ ప్రస్తుతం నటిస్తోన్న 'క్రాక్' సినిమా షూటింగ్ తుదిదశకు చేరుకుంది. ఈ చిత్రాన్ని కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. కథానాయికగా శ్రుతిహాసన్ను ఎంపికచేశారు.
ఇదీ చదవండి:వరుస సినిమాలతో బిజీగా వరుణ్ ధావన్