యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా 'రాధేశ్యామ్'(prabhas radhe shyam movie). విభిన్న కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 14న థియేటర్లలో విడుదల చేయనున్నారు(prabhas radhe shyam movie release date). ఇప్పుడు సరికొత్త మార్క్‌ను అందుకునేందుకు రాధేశ్యామ్ టీమ్ రెడీ అవుతోంది.
ఉత్తరాదిలో ఈ సినిమాను ఏకంగా 3500 స్క్రీన్లలో రిలీజ్ చేయనున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే దక్షిణాది నుంచి ఈ ఘనత సాధించిన తొలి చిత్రం ఇదే అవుతుంది. మరో విశేషమేమిటంటే ఈ సినిమా నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిందని సమాచారం.
'రాధేశ్యామ్'.. రికార్డు స్థాయిలో రిలీజ్‌కు ప్లాన్! - రాధేశ్యామ్ మూవీ
డార్లింగ్ ప్రభాస్ 'రాధేశ్యామ్'(prabhas radhe shyam movie release date) చిత్రబృందం మాస్టర్ ప్లాన్ వేస్తోంది. ఏ దక్షిణాది సినిమాకు సాధ్యం కాని రికార్డును సృష్టించేందుకు సిద్ధమవుతోంది. ఇంతకీ అదెంటంటే?
రాధేశ్యామ్
'రాధేశ్యామ్' నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్, పాట.. సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతమందించగా, రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు(prabhas radhe shyam movie director). యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. సంక్రాంతికి 'ఆర్ఆర్ఆర్' జనవరి 7న, 'భీమ్లా నాయక్' 12న విడుదల కానుండగా.. 'రాధేశ్యామ్' జనవరి 14న రిలీజ్ కానుంది.
ఇదీ చూడండి: హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్