సుజిత్ దర్శకత్వంలో బాహుబలి ప్రభాస్, బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్‌తో కలిసి నటిస్తోన్న చిత్రం 'సాహో'. ఈ సినిమాలోని పాటలను ఆస్ట్రియాలో చిత్రీకరిస్తున్నారు. అయితే షూటింగ్లో కాస్త విరామం దొరకడం వల్ల ఈ ఇద్దరూ అక్కడ లోకల్ మెట్రోలో ప్రయాణించారు.
మెట్రో ట్రైన్‌లో సందడి చేసిన సాహో - sahoo songs shoot astria
రెబల్ స్టార్ ప్రభాస్ మెట్రో ట్రైన్‌లో సందడి చేశాడు. చిరిగిన జీన్స్.. పైనేమో బ్లాక్ టీ షర్ట్.. యువతుల మది దోచేసే చిరునవ్వుతో కనిపించాడు. చుట్టూ అందాల గోపికలు కూర్చొని ఉండగా మెట్రో ట్రైన్‌లో సాగింది ‘సాహో’ రొమాంటిక్ ప్రయాణం.
మెట్రో ట్రైన్‌లో సందడి చేసిన సాహో
తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ సందడి చేస్తున్నాయి. అక్కడ చిత్రీకరణ పూర్తికాగానే.. వీరిద్దరూ ‘సాహో’ ప్రచార కార్యక్రమాల్లో బిజీ కానున్నారు.
ఈ చిత్ర విడుదలకు మరికొద్ది రోజుల సమయమే ఉండటం వల్ల నిర్మాణాంతర పనులను వేగవంతం చేసింది చిత్ర బృందం. త్వరలోనే పాటలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. దాదాపు రూ.250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆగస్టు 15న విడుదల కాబోతుంది.