తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అల్లు 'రామాయణం'లో రెబల్​స్టార్​ ప్రభాస్​..! - darling prabhas

'సాహో' సినిమా తర్వాత రామాయణంలో నటించనున్నాడట డార్లింగ్​ ప్రభాస్​. ప్రముఖ తెలుగు నిర్మాతలు అల్లు అరవింద్​, మధు మంతెన ఈ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

అల్లు 'రామాయణం'లో రెబల్​స్టార్​ ప్రభాస్​..!

By

Published : Sep 19, 2019, 5:15 AM IST

Updated : Oct 1, 2019, 3:52 AM IST

టాలీవుడ్​లో ఓ భారీ బడ్జెట్​ చిత్రంగా రామాయణాన్ని తెరకెక్కించేందుకు ప్రణాళిక రెడీ చేస్తున్నారు ప్రముఖ తెలుగు నిర్మాతలు అల్లు అరవింద్‌, మధు మంతెన. ఇప్పటికే ఈ చిత్రంలో రాముడిగా బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌, సీతగా దీపికా పదుకొణెలను తీసుకొన్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే ఇందులో హృతిక్​ను ఎదుర్కొనే రావణుడి పాత్రను ఎవరు చేస్తారనేదానిపై ఆసక్తి ఏర్పడింది.

తాజాగా ఈ పాత్ర కోసం బాహుబలి ప్రభాస్‌ను తీసుకోవాలని చిత్ర నిర్మాతలు ఆలోచిస్తున్నారట. అయితే ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. భారీ బడ్జెట్​తో తెరకెక్కించాలని అనుకుంటున్న ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపట్టేందుకు... బాలీవుడ్​ ప్రముఖ నిర్మాత నమిత మల్హోత్రా కూడా ఓకే చెప్పారట.

ప్రభాస్‌ ఇప్పుడు దేశమంతటా క్రేజ్‌ ఉన్న పెద్ద కథానాయకుడు. అందుకే రెబల్​స్టార్​ను రావణ పాత్రకు ఎంచుకోవడం ఓ కారణం కావచ్చు. ఇలాంటి పెద్ద చిత్రాలు తీసేటప్పుడు నటీనటులు అందరికీ తెలిసినవాళ్లయితే సినిమాకు మరింత లాభమని చిత్రవర్గాలు అంటున్నాయి.

ఇదీ చదవండి...

Last Updated : Oct 1, 2019, 3:52 AM IST

ABOUT THE AUTHOR

...view details