'జిల్' ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం పూర్తయిన వెంటనే నాగ్ అశ్విన్ సినిమాలో నటించనున్నాడు ప్రభాస్. ఇటీవలే దీనిపై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ చిత్రానికి ప్రభాస్ అధిక మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. ఏకంగా రూ.60 కోట్లు ఇవ్వటానికి వైజయంతి మూవీస్ సంస్థ సిద్ధమైనట్టు సమాచారం. ఓ భారీ సైన్స్ ఫిక్షన్ కథాంశంతో రూపొందబోయే ఈ చిత్రాన్ని.. అన్ని భారతీయ భాషల్లోనూ విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది.
'సాహో' తర్వాత ప్రభాస్ నుంచి రాబోతున్న చిత్రం 'జాన్' (వర్కింగ్ టైటిల్). పూజా హెగ్డే కథానాయిక. ఓ వైవిధ్యమైన పీరియాడికల్ ప్రేమకథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 70వ దశకం నాటి యూరప్ ప్రాంతంలో సాగే ప్రేమకథగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యూరప్‌లో ఓ షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. మరికొద్ది రోజుల్లో ఓ కొత్త షెడ్యూల్ కోసం మళ్లీ అక్కడకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ షెడ్యూల్ గురించి ఓ కీలకవార్త బయటకొచ్చింది.