తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అందుకే ఆ సన్నివేశాల్లో నటించా: రాశీఖన్నా - entertainment news

'వరల్డ్​ ఫేమస్ లవర్​'లోని కొన్ని బోల్డ్​ సన్నివేశాల్లో నటించింది హీరోయిన్ రాశీఖన్నా. ఈ విషయంలో తనపై వస్తున్న ట్రోలింగ్​పై స్పందించింది. అలా నటించడానికి గల కారణాలు చెప్పింది.

'వరల్డ్​ ఫేమస్ లవర్​'
హీరోయిన్ రాశీఖన్నా

By

Published : Feb 5, 2020, 6:47 PM IST

Updated : Feb 29, 2020, 7:25 AM IST

హీరో విజయ్ దేవరకొండ 'వరల్డ్ ఫేమస్ లవర్​'లో కొన్ని సన్నివేశాల్లో బోల్డ్​గా నటించి, అభిమానుల్ని ఆశ్యర్యానికి గురిచేసింది హీరోయిన్ రాశీఖన్నా. ముఖ్యంగా టీజర్​లో ఆమె టాప్​లెస్​గా కనిపించడం సహా లిప్​లాక్, రొమాంటిక్ సీన్లలో రెచ్చిపోయింది. ఇలా కావాలనే నటించానని చెప్పిందీ భామ. అందుకు గల కారణాలు వెల్లడించింది.

'వరల్డ్​ ఫేమస్ లవర్​'లో హీరోయిన్ రాశీఖన్నా

"ఈ సినిమాలో అందరూ అనుకున్నట్లు యామిని పాత్ర బోల్డ్ కాదు. ఒకటి రెండు సన్నివేశాలు చూసి, నాపైనా, చిత్రంపైనా అంచనాకు రావడం సరికాదు. కథాబలమున్న సినిమాల్లో ఇలాంటి సీన్లు తప్పనిసరి. కథ డిమాండ్​ చేసింది కాబట్టే అలా నటించాల్సి వచ్చింది" -రాశీఖన్నా, హీరోయిన్

ఇటీవలే వచ్చిన టీజర్ అలరిస్తోంది. రేపు(గురువారం) ట్రైలర్​ రానుంది. వాలంటైన్స్​ డే కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఇందులో విజయ్ సరసన రాశీఖన్నాతో పాటు ఐశ్వర్య రాజేశ్, కేథరిన్, ఇస్​బెల్లా హీరోయిన్లుగా నటించారు. గోపీసుందర్ సంగీతమందించాడు. క్రాంతి మాధవ్ దర్శకుడు. కెఎస్ రామారావు నిర్మించారు.

Last Updated : Feb 29, 2020, 7:25 AM IST

ABOUT THE AUTHOR

...view details