హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలంటే గుర్తొచ్చే పేరు కంగనా రనౌత్. ఈ ఏడాది ‘మణికర్ణిక’గా బాక్సాఫీస్‌ను షేక్ చేసిందీ లేడీ స్టార్. ఇటీవలే 'ధాకడ్' టీజర్‌తో అలరించింది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా'తలైవి'చిత్రం త్వరలో పట్టాలెక్కనుంది. ఇందులో జయలలిత పాత్ర పోషించేందుకు సిద్ధమవుతోంది కంగనా. అక్టోబరు తొలి వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
ఈ చిత్రానికి ఏ.ఎల్.విజయ్ దర్శకత్వం వహించనున్నాడు. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకున్నాయి.