తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ప్రభాస్-మహేశ్​ల తల్లి పాత్రలకు రేణు సిద్ధం - మహేశ్ ప్రభాస్ రేణు దేశాయ్

పవన్​ మాజీ భార్య రేణు దేశాయ్.. ప్రభాస్, మహేశ్​లకు తల్లి పాత్రలు పోషించేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

'ప్రభాస్-మహేశ్​ల తల్లి పాత్రలకు నేను సిద్ధం'
నటి రేణు దేశాయ్

By

Published : May 2, 2020, 9:54 AM IST

పవర్​స్టార్ పవన్​కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ ప్రముఖ హీరోలు మహేశ్​బాబు, ప్రభాస్​లకు తల్లిగా నటించేందుకు సిద్ధమని చెప్పింది. తాజాగా జరిగిన ఓ టీవీ లైవ్​ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాలు పంచుకుంది.

"టాలీవుడ్​ రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నా. ప్రభాస్, మహేశ్​బాబు వంటి హీరోలకు తల్లి పాత్రలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. దర్శకులు నా పాత్రను బలంగా తీర్చిదిద్దితే, నటించడానికి నేను రెడీ" -రేణు దేశాయ్, నటి-నిర్మాత-దర్శకురాలు

తెలుగులో పవన్​తో కలిసి 'బద్రి', 'జానీ' సినిమాల్లో నటించిన రేణు.. ఖుషీ, జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం చిత్రాలకు కాస్ట్యూమ్​ డిజైనర్​గా పనిచేసింది. ఆ తర్వాత పుణె వెళ్లిపోయిన ఈమె... 2012లో 'మంగళస్తక్​ వన్ మోర్​' అనే మరాఠీ సినిమాను నిర్మించింది. 2014లో వచ్చిన 'ఇష్క్ వాలా లవ్​'తో దర్శకురాలిగా తన ప్రతిభ నిరూపించుకుంది.

నటి-దర్శకురాలు రేణు దేశాయ్

ABOUT THE AUTHOR

...view details