విభిన్న పాత్రల్లో నటించాలనుకుంటున్నట్లు తనలోని కోరికను వెల్లబుచ్చింది నటి రెజీనా కసాండ్రా. ఎస్.ఎం.ఎస్ (శివ మనసులో శ్రుతి) చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై అందం, అభినయంతో టాలీవుడ్‌లో అందరి దృష్టిని ఆకర్షించిందీ ముద్దుగుమ్మ. ఎక్కువగా ప్రేమకథా చిత్రాల్లో నటించిన ఈ భామ 'ఆ!', 'ఎవరు' సినిమాలతో పంథా మార్చింది. ఈ రెండు చిత్రాల్లోని పాత్రలు ఆమెకు నటిగా మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.
'అలాంటి పాత్రలు చేయాలని ఉంది' - రెజీనా
ప్రేమకథా చిత్రాల్లోనే కాకుండా విభిన్న సినిమాల్లోనూ నటించాలనుకుంటున్నట్లు వెల్లడించింది నటి రెజీనా కసాండ్రా. నటిగా సవాళ్లు విసిరే పాత్రలను చేయడమంటే ఇష్టమంటోందీ ముద్దుగుమ్మ.
'విభిన్న పాత్రలనూ పోషించడానికి సిద్ధమే!'
ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ఇంకా తనకు ఎలాంటి పాత్రలు చేయాలనుందో తెలిపింది రెజీనా. నటిగా సవాళ్లు విసిరే పాత్రలు, బోల్డ్ అమ్మాయిగా, ఉత్కంఠ రేకెత్తించే థ్రిల్లర్ పాత్రలు చేయాలనుందని చెప్పుకొచ్చింది. త్వరలో 'నేనే నా' అనే చిత్రంతో రాబోతుంది రెజీనా. చిరంజీవి సరసన 'ఆచార్య'లో ప్రత్యేక గీతంతో సందడి చేయబోతుంది.
ఇదీ చూడండి.. 'నేను నటుడినే కానీ.. నటించలేకపోయాను'